పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగ అని చెప్పాలి. థియేటర్లలో అభిమానులు తమ హీరో సినిమా చూస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆతృతగా చూస్తున్నారు.
‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. కాగా, ఈ చిత్రం ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 9 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు ఉండగానే ఈ చిత్రం విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.