పవన్ ఫ్యాన్స్‌కు ఆదిలోనే నిరాశ.. సంధ్య థియేటర్‌లో వీరమల్లు ట్రైలర్ క్యాన్సిల్

పవన్ ఫ్యాన్స్‌కు ఆదిలోనే నిరాశ.. సంధ్య థియేటర్‌లో వీరమల్లు ట్రైలర్ క్యాన్సిల్

Published on Jul 2, 2025 9:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు రేపటి(జూలై 3) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అంతేగాక, ఈ ట్రైలర్ లాంచ్‌ను తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో గ్రాండ్‌గా చేయనున్నారు. అయితే, పవన్ అభిమానులకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యం షాక్ ఇచ్చింది.

ఈ థియేటర్‌లో ట్రైలర్ స్క్రీనింగ్ కోసం పాసులు జారీ చేశారు. అయితే, ఈ పాస్‌ల కోసం అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, కేవలం పాసుల కోసమే ఇంత జనం రావడంతో, రేపు ట్రైలర్ స్క్రీనింగ్‌కు ఎంతమంది వస్తారో ఊహించడం కష్టమని.. అందుకే తమ థియేటర్‌లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.

దీంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇక ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు