‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ పై నిర్మాత క్లారిటీ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 12న, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. అందరూ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, కానీ సినిమా రెండవ భాగంలో విస్తృతమైన సిజి పని కారణంగా ట్రైలర్ రిలీజ్ ఆలస్యం అయిందని, త్వరలో ట్రైలర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంటుందని, అధికారికంగా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటిస్తాం అని ఈ చిత్ర నిర్మాత ఎ. ఎం. రత్నం తెలిపారు.

అన్నట్టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే

Exit mobile version