‘హరిహర వీరమల్లు’ మరో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యాయి. ఇక ఇప్పుడు మరో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వీరమల్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూలై 23న సాయంత్రం 4 గంటల నుంచి విశాఖపట్నంలోని ఏయు కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

దీంతో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎలా జరగబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version