3BHK ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేది అరోజేనా..?

3BHK

హీరో సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ 3 BHK ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను శ్రీ గణేష్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఆగస్టు 5 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జె అచార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version