పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఈ అంచనాలను అమాంతం పెంచేశాయి. జూలై 24న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో అప్డేట్ అయితే మేకర్స్ అందించారు. ఈ సినిమాను తొలి రోజు తొలి ఆటకే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియెన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉంటారు. వారి కోసమే ఈ స్పెషల్ న్యూస్ అని చెప్పాలి. వీరమల్లు బాక్సాఫీస్ ఊచకోతకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ జూలై 10 నుంచి ఓపెన్ కానున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
దీంతో వీరమల్లు దాడికి బాక్సాఫీస్‌ను ముందు నుంచే రెడీ చేస్తున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూపంలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఓవర్సీస్‌లో వీరమల్లు ఊచకోత ముందుగానే ప్లాన్ చేశారని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఎం ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.