‘కన్నప్ప’కు భారీ షాక్.. కీలక సన్నివేశాల డ్రైవ్ మిస్

టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా, ఎం.మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ఈ సమయంలో ఈ చిత్ర యూనిట్‌కు ఓ భారీ షాక్ తగిలింది.

‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనలో పడ్డారు. కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ఎలా మిస్ అయ్యిందనే విషయాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఈ హార్డ్ డ్రైవ్ మిస్ కావడంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version