సక్సెస్ఫుల్ పిఆర్ఓ బి.ఎ రాజుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

సక్సెస్ఫుల్ పిఆర్ఓ బి.ఎ రాజుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published on Jan 7, 2013 7:29 AM IST

B-A-Rajuతెలుగు చలన చిత్ర పరిశ్రమ టాప్ పిఆర్ఓ, సూపర్ హిట్ మ్యాగజైన్ అధినేత బి.ఎ. రాజు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలకి పర్సనల్ పిఆర్ఓ గా పని చేస్తున్న ఆయన నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన సతీమణి బి. జయ డైరెక్షన్లో వచ్చిన ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ సినిమాలు ఆయన సొంత బ్యానర్ పై నిర్మించారు. త్వరలో ఆర్.జే సినిమాస్ బ్యానర్ పై బి. జయ డైరెక్షన్లో త్వరలో ఒక సినిమా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాని జూన్లో ప్రారంభించనున్నారు.

ఆయన ఇలాగే మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ 123తెలుగు.కాం తరపున బి.ఎ. రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు