ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయనకు సూపర్ హిట్స్ వచ్చాయి, సూపర్ ఫ్లాప్స్ కూడా వచ్చాయి. నేటితో ఈ బాలీవుడ్ అందగాడు 46 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ముస్లిం తండ్రి మరాఠీ తల్లికి జన్మించిన సల్మాన్ ఖాన్ గ్వాలియర్ లో పుట్టి తన కుటుంబం ముంబైకి మారిపోవడం అక్కగే పెరిగాడు. ‘బీవీ ఐతో ఐసీ’ చిత్రంతో తెరపై అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు. ఆ చిత్రం సల్మాన్ ఖాన్ స్టార్ఢమ్ అమాంతం ఒకే సారి పెంచేసింది.
ఇప్పటి వరకు 80 చిత్రాలకు పైగా నటించిన ఆయన చిత్రాలలో అత్యదిక గ్రాస్ వసూలు చిత్రాలు చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ సల్లు భాయ్ అని ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్ ఇండియాలోని అందగాడిగా చాలా పోటీలలో గెలుపొందారు. తను నటించిన చిత్రాలలో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’, ‘సాజన్’, ‘కరణ్ అర్జున్’, ‘వాంటెడ్’ , ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.
123తెలుగు.కాం తరపున ఈ బాలీవుడ్ అందగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు