సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు

Mahesh-Babu
ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఆయన 1975 ఆగష్టు 9న సుపెర్ స్టార్ కృష్ణ గారికి వారసుడిగా ఘట్టమనేని మహేష్ బాబుగా జన్మించాడు. ఇందిర, మహేష్ బాబు బాల్యం అంతా వాళ్ళ చెన్నైలోని వాళ్ళ భామ్మ దగ్గరే గడిచింది. చెన్నై లయోలా కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత 1990లో ‘రాజకుమారుడు’ సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి చాలా కాలం ముందు కృష్ణ గారు నటించిన ‘గూడాచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలచంద్రుడు’ లాంటి సినిమాల్లో నటించాడు.

ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ‘యువరాజు’, ‘వంశీ’ సినిమాల తర్వాత మహేష్ బాబు 2001లో వచ్చిన ‘మురారి’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. 2003 గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాతో మహేష్ కి స్టార్డం వచ్చింది. ఆ తర్వాత మహేష్ చేసిన ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’ సినిమాలతో సౌత్ ఇండియన్ టాప్ హీరోస్ లిస్టులో చేరిపోయాడు. ఈ సంవత్సరం వెంకటేష్ గారితో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.

తెలుగు సినిమా రంగంలో బెస్ట్ యాక్టర్స్ లో ఒకడుగా నిలిచిపోయాడు. అలాగే ఇండియాలోనే మోస్ట్ హాన్డ్సం హీరోస్ లో ఒకడిగా కూడా చోటు సంపాదించుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

Exit mobile version