సూపర్ స్టార్ రజినీకి జన్మదిన శుభాకాంక్షలు


రజినీకాంత్ గురించి చెప్పాలంటే ‘ రజినీకాంత్ చేయలేనిదంటూ ఏమీ లేదు’. ఒక్క లైన్లో చెప్పమంటే అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్, తెరపై అతని ప్రెసెన్స్, తన హీరోయిజంతో ఎవ్వరూ చేయలేనిది కూడా చేయగల క్రెడిట్ ఒక్క రజినీ గారికే ఉంది. 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాద్ గా జన్మించారు. రజినీ ఈ రోజు 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. రజినీ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా కూడా పనిచేసారు. అతనిలోని పెర్ఫార్మెన్స్ మరియు స్టైల్ ని తొందరగా క్యాచ్ చేసిన కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగారు, 990ల్లో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు.

‘దళపతి’, ‘భాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘అంతులేని కథ’, ‘నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ మొదలైన సినిమాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు. రజినీకాంత్ గారికి తెలుగులో కూడా చాలా పాపులారిటీ ఉంది, అలాగే రజినీకి జపాన్ లో కూడా ఫాన్స్ ఉన్నారు. అంత స్టార్డం ఉన్నా రజినీ మాత్రం చాలా సింపుల్ గా, అందరితోనూ ఎంతో వినయంగా ఉంటారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Exit mobile version