మణిరత్నం, ఇళయరాజా లకు జన్మదిన శుభాకాంక్షలు

Mani-Ratnam-And-Ilayaraja
సౌంత్ ఇండియా నుంచి ప్రస్థానం మొదలు పెట్టి ఇండియన్ సినిమాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాస్ట్రో ఇళయరాజా, మణిరత్నంల పుట్టిన రోజు ఈ రోజు. మాస్ట్రో ఇళయరాజా గారు తన మధురమైన సంగీతంతో గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మణిరత్నం గారు ఎందుకు ఇండియన్ సినిమాలో ది బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఎందుకుంటారో అనే దానికి ఆయన వరుసగా అందుకున్న విజయాలే నిదర్శనం. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండియన్ సినిమా గురించి తెలిసిన వారికి ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినిమా తెలిసిన ప్రతి ఒక్కరికీ వీరు సుపరిచితులే.

మరో వైపు మణిరత్నం, ఇళయరాజా గారు ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఎలా సినిమాలు చేయగలుగుతున్నారు అనేది ఆసక్తికరమైన విషయం. వీరిద్దరూ 1980ల నుంచి కలిసి పనిచేస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్లో ‘మౌన రాగం’, ‘నాయకుడు’, ‘గీతాంజలి’ సినిమాలు వచ్చాయి. 1990 వరకూ వీరిద్దరి కాంబినేషన్ కొనసాగింది, వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా వచ్చిన సినిమా ‘దళపతి’. ‘రోజా’ సినిమా నుంచి మణిరత్నం ఎఆర్ రెహమాన్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఎవరి రంగంలో వారు సిద్దహస్తులయ్యారు, అలాగే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. కానీ భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో కచ్చితంగా ఓ సినిమా ఉంటుందని వారి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున మాస్ట్రో ఇళయరాజా, మణిరత్నం గార్లకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version