మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. మార్చి 27 1985లో మెగాస్టార్ చిరంజీవి – శ్ర్రీమతి సురేఖ దంపతులకి చెన్నైలో జన్మించాడు. తన చదువు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత 2007లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. 2009లో ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ‘మగధీర’ సినిమాతో చరణ్ కి సూపర్ స్టార్డం రావడమే కాకుండా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇటీవల కాలంలో రామ్ చరణ్ తన సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రామ్ చరణ్ చివరి చిత్రాలైన ‘రచ్చ’, ‘నాయక్’ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం చరణ్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ‘ఎవడు’, బాలీవుడ్ ఫిల్మ్ ‘జంజీర్’(తెలుగులో తుఫాన్) సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలో సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో చరణ్ కూడా ఒకరు, అందరూ తనని తండ్రికి తగ్గ తనయుడు అని సంబోదిస్తుంటారు.
123తెలుగు.కామ్ తరపున రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.