వీడియో అల్భమ్ చేయాలనుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్

chakri

ఎన్నో మధురమైన పాటలకు సంగీతాన్ని అందించి అందరి మనసును గెలుచుకున్న సంగీత దర్శకులు చక్రి పుట్టిన రోజు ఈ రోజు. అలాగే చక్రి గారి తండ్రి పుట్టినరోజు కూడా ఈ రోజే . ఈ సందర్భంగా చక్రి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ప్రసాద్ ల్యాబ్ లో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ మద్య సినిమాలోని పాటలలో పాశ్చాత్య దేశాల సంగీతామే వినిపిస్తోంది. మనదైన మెలోడి సంగీతం వినిపించడంలేదు. అసులు సాహిత్యానికి ముఖ్యమైనది మెలోడీ గీతమే’ అని అన్నారు. అలాగే సామాజిక సంక్షేమాన్ని కోరుకుంటూ ఒక ప్రైవేట్ వీడియో ఆల్బమ్ ని ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నట్టు ఆయన తెలియ జేశారు.

చక్రి జూన్ 15న వరంగల్ జిల్లా మహాబుబాబాద్లో జన్మించాడు. ‘బాచి’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంబించిన చక్రి ఎన్నో సినిమాలకు చక్కని సంగీతాన్ని అందించాడు. క్లాస్,మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించి అందరి మనసును గెలుచుకున్న సంగీత దర్శకులు ఆయన. ప్రస్తుతం చక్రి ‘తను మొన్నే వెళ్ళిపోయాడు’, రవిబాబు దర్శకత్వంలో రాబోతున్న అల్లరి నరేష్ సినిమాకి, శ్రీకాంత్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

123తెలుగు.కామ్ తరువున చక్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు

Exit mobile version