బోయపాటి శ్రీనుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

బోయపాటి శ్రీనుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published on Apr 25, 2012 10:14 AM IST


మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ రోజు ఈ మాస్ దర్శకుని పుట్టినరోజు. 2005లో “భద్ర” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ దర్శకుడు తరువాత 2007లో విక్టరీ వెంకటేష్ తో “తులసి” చిత్రంతో తన సత్తా చాటారు. 2010లో విడుదలయిన సింహ చిత్రంతో ఈ దర్శకుడు పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో చేరిపోయారు. మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్బుతమయిన కలెక్షన్లను రాబట్టాయి. తన గుణంతో పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు.

బోయపాటి తను సృష్టించిన పాత్రలో తానే నిలబడి నటుడికి వివరిస్తారు. చిత్రంలో సన్నివేశాలను చిత్రీకరించేపుడు ఆయన్ని గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఈయన తరువాతి చిత్రం “దమ్ము” శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

బోయపాటి శ్రీను గారికి 123తెలుగు.కాం బృందం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు