కామెడీ కింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు


ఈ రోజు అల్లరోడు పుట్టిన రోజు. అదేనండి అల్లరి సినిమా ద్వారా అల్లరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నరేష్ ఆ తరువాత అదే సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈ రోజు. చెన్నైలోస్కూల్ లైఫ్ పూర్తి చేసుకుని ఆ తరువాత 2002లో అల్లరి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమయినప్పటికీ తన సొంత టాలెంట్ నమ్ముకుని ప్రేక్షకులను నవ్విస్తూ కామెడీ కింగ్ గా ఎదిగాడు. కామెడీ సినిమాల్లో నటిస్తూనే నేను, శంభో శివ శంభో, గమ్యం వంటి చిత్రాలతో తనలోని సీరియస్ నటుడిని చూపించాడు. ప్రస్తుతం నరేష్ సుడిగాడు, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Exit mobile version