కితకితలు పెట్టే నరేష్ కి జన్మదిన శుభాకాంక్షలు

Allari-Naresh
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఒకరు, ఈ అల్లరోడి పుట్టిన రోజు ఈ రోజు. అల్లరి నరేష్ ఇండస్ట్రీకి పరిచయమై పది సంవత్సరాల పైన అయ్యింది. తాజాగా నరేష్ ‘యాక్షన్ 3డి’ సినిమాతో 3డిలో ఆడియన్స్ ని నవ్వించారు. ఆతని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నరేష్ కామెడీతోనే కాకుండా ‘నేను’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘సంఘర్షణ’ లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలతో కూడా మనల్ని మెప్పించాడు. ‘కితకితలు’, ‘సీమశాస్త్రి’, ‘బ్లేడ్ బాబ్జీ’, ‘సుడిగాడు’ సినిమాలతో అల్లరి నరేష్ తన కామెడీతో ఆడియన్స్ కి కితకితలు పెట్టాడు.

ప్రస్తుతం అల్లరి నరేష్ రవిబాబు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ బాగా లావుగా ఉండే పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ఆ లుక్ కోసం కొంత మంది ఫారిన్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కాకుండా సత్తిబాబుతో ‘జంప్ జిలానీ’ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవన్నీ కాకుండా తను సొంతంగా ఓ సినిమా డైరెక్ట్ చేయనున్నాడు, అలాగే ఈవివి బ్యానర్ లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అతని కలలన్నీ నెరవేరి తెలుగు ప్రేక్షకులని బాగా నవ్వించాలని కోరుకుందాం.

ఈ రోజు కామెడీ కింగ్ అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version