ఎ.ఆర్ రెహమాన్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఎ.ఆర్ రెహమాన్ కి జన్మదిన శుభాకాంక్షలు

Published on Jan 6, 2013 5:30 PM IST

ar-rehman
ఇండియా నుంచి ఆల్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న ఎ.ఆర్ రెహమాన్ ఈ రోజు తన 47వ పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నాడు. మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తన మ్యూజిక్ తో అందరి ప్రశంశలు అందుకున్నాడు. ఇంటర్నేషనల్ గా ఎంతో ప్రతిష్టాత్మకమైన రెండు ఆస్కార్ అవార్డ్స్ ని అందుకున్నాడు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్ గెలుచుకొని అంతర్జాతీయంగా పేరు గడించాడు.

ఆయన తెలుగు సినిమాలకు తక్కువగా మ్యూజిక్ కంపోజ్ చేసినా ఆయన మ్యూజిక్ చేసిన అన్ని తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించారు. ఇండియా మొత్తం ఫేమస్ అయిన రెహమాన్ గత కొన్ని సంవత్సరాలుగా కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎ.ఆర్ రెహమాన్ ప్రస్తుతం మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కడల్’ సినిమాకి సంగీతం అందించాడు. తమిళనాడులో ఈ పాటలకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

మొజార్ట్ అఫ్ మద్రాసు అని పిలుచుకునే ఎ.ఆర్ రెహమాన్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు