మరో అవతారం ఎత్తాలనుకుంటున్న హన్సిక


పరిశ్రమలో కథానాయికలు అంటే అందం కోసం అని లేదా అభినయం కోసం అని చాలా మంది అభిప్రాయం. చాలా మంది కథానాయికలు కూడా గ్లామర్ ఉన్న రోజుల్లో మంచి నటిగా పెఉర్ తెచ్చుకొని కావలసినంత కూడా బెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కాని కొంతమంది కథానాయికలు మాత్రమే తమలోని ప్రత్యేకతను చూపించుకోడానికి ఇష్టపడి సాంకేతిక అంశాల వైపు మళ్లుతారు కాని నిర్మాణ రంగం అంటే దాదాపుగా ఎవరూ మక్కువ చూపించరు పాత రోజుల్లో అంజలి దేవి, భానుమతి, సావిత్రి మరియు విజయ నిర్మల వంటి కథానాయికలు మాత్రమే నిర్మాణం వైపు మొగ్గు చూపారు. అటువంటి నిర్మాణ విభాగం వైపు హీరొయిన్ హన్సిక మక్కువ చూపుతున్నారు. చిత్రీకరణ సమయంలో పరిసరాలను గమనిస్తూ గడిపే హన్సికను నిర్మాణ రంగం బాగా ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం ఒక ప్రముఖ పత్రికకు చెబుతూ “అమెరికా వెళ్లి నిర్మాణంలో శిక్షణ తీసుకోబోతున్నాను అక్కడ నిపుణుల దగ్గర పలు విషయాలు నేర్చుకొని మన పరిశ్రమలో “ది బెస్ట్” అనిపించేలా మంచి చిత్రాలు తియ్యాలని నా లక్ష్యం” అని అన్నారు. అందాల నటి నిర్మాతగా మారుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలి అనుకోడం శుభపరిణామం. అల్ ది బెస్ట్ హన్సిక.

Exit mobile version