ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న హన్సిక హార్రర్ చిత్రం ‘గార్డియన్’

హార్రర్ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణ చూపిస్తున్నారు. ఇక డబ్బింగ్ చిత్రాల్లో కూడా హార్రర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అయితే, హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘గార్డియన్’ చిత్రం తమిళనాట గత ఏడాది రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాను శబరి, గురు శరవణన్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘గార్డియన్’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పటికే తమిళంలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

దీంతో ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో సురేశ్ చంద్ర మీనన్, శ్రీమన్, రాజేంద్రన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Exit mobile version