‘దేశముదురు’ సినిమా విజయంతో తెలుగుతెరకు పరిచయమైన హన్సిక ప్రస్తుతం తమిళ మరియు తెలుగు భాషలలొ చేతినిండా సినిమాలతో బిజీగా వుంది.
ప్రస్తుతం ఈ భామ ‘ఆరణ్మనై’ అనే తమిళ సినిమాలో నటిస్తుంది. గత నెలరోజులుగా హన్సిక విషపు జ్వరం, జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నా పనిమీద వున్న తపన తనను షూటింగ్ కు అంతరాయం కలగనివ్వకుండా చేసింది. అయితే ఇప్పుడు ఆమె అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకుంది. తెలుగులో హన్సిక మంచు వారి ఫ్యామిలీ ఎంటెర్టైనర్ లో మరియు రవితేజ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది
ఈ యేడాది హన్సిక డైరీలో కాల్షీట్లు దొరకడం కష్టం. ఆమె వివిధ బాషలలో పలు సినిమాలలో నటిస్తుంది