బాలయ్య బాబుతో స్టెప్పులేయనున్న హంసానందిని?

బాలయ్య బాబుతో స్టెప్పులేయనున్న హంసానందిని?

Published on Mar 2, 2014 9:20 AM IST

hamsanandin_balakrishna
సమాచారం ప్రకారం అత్తారింటికి దారేది, మిర్చి, ఈగ వంటి సినిమాలలో తళుక్కున మెరిసిన తార హంసానందిని మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. లెజెండ్ లో ఒక ప్రత్యేక పాటకు బాలయ్య, సోనాల్ చౌహాన్ లతో కలిసి నర్తించనుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు

ఒక్క పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ పాటలోనే హంస నందిని నటిస్తుందని, చిత్రీకరణ ఈనెల 5నుండి మొదలుకానుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న ఈ పాట షూటింగ్ కు ప్రేమ్ రక్షిత్ స్టెప్పులు సమకూరుస్తున్నాడు. ముందుగా ఈ పాటకోసం బాలీవుడ్ తార బిపాసాబసును అనుకున్నా అది కుదరలేదు

ఈ సినిమా ఆడియో మార్చ్ 7న విడుదలకానుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందించాడు. అనీల్ సుంకర, రామ్ ఆచంట మరియు గోపీచంద్, సాయి కొర్రపాటి ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరియు వారాహి చలన చిత్ర బ్యానర్ల ద్వారా నిర్మిస్తున్నారు. ఈనెల 28న ఈ సినిమా మనముందుకురానుంది

తాజా వార్తలు