హంసా నందిని – ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అన్నింటిలోనూ ఈ భామే కనిపించడం వల్ల ఈ పేరుకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ భామ ‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు వారికి హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో చేసిన చిన్న పాత్రకి చాలా మంచి పేరు రావడంతో ఆ తర్వాత వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్, అతిధి పాత్రలు వస్తున్నాయి. ఈ సంవత్సరం వచ్చిన దాపు అందరి టాప్ హీరోల సినిమాల్లోనూ హంసానందిని కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.
స్పెషల్ సాంగ్స్, అతిధి పాత్రలు, గ్లామరస్ రోల్స్ ఏనా లేక డీ గ్లామరస్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నారా? అని హంసానందిని అడిగితే సమాధానమిస్తూ ‘ స్పెషల్ సాంగ్స్ నాకు మంచి పేరు తెచ్చాయి కావున అవి చేయడానికి నేనెప్పుడూ సిద్దమే. అలాగని స్పెషల్ సాంగ్స్ కే పరిమితమైతే నాకు నేను బోర్ కొట్టడమే కాకుండా ప్రేక్షకులకి కూడా బోర్ కొట్టెస్తాను. అందుకే సినిమాల్లో లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. నటిగా నిరూపించుకునే ఏ పాత్ర అయినా చేస్తాను. కథ, పాత్ర బాగుంటే ఆర్ట్ ఫిల్మ్ చెయ్యడానికైనా నేను రెడీ. అలాగే మంచి ఫైట్ సీన్స్ ఉండే యాక్షన్ సినిమాలో చేయడానికి కూడా నేను సిద్దమేనని’ చెప్పింది. ప్రస్తుతం హంసానందిని ‘రుద్రమదేవి’ సినిమాలో ‘మధానిక’ అనే పాత్రలో కనిపించనుంది.