సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ తన వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. తన సతీమణి సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజం అయింది. జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2013లో వీరిద్దరూ లవ్ మ్యారేజీ చేసుకోగా ఒక కూతురు ఉంది. వీరిద్దరూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి దంపతులు ఈ ఏడాది మేలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూతురు సైంధవి వద్ద ఉండేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకాశ్ కోర్టుకు తెలపడం విశేషం. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. అయితే, కొందరు నెటిజన్లు వీరి విడాకుల పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సింగర్ సైంధవి మాట్లాడుతూ.. ‘ఈ పెళ్లిళ్లు, విడాకులు, ఆందోళనలు, ఆత్మీయుల మరణాలు.. ఇవన్నీ మనదాకా వస్తేనే పూర్తిగా అర్థమవుతాయి’ అని సింగర్ సైంధవి చెప్పుకొచ్చింది.