ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న సంగీత దర్శకుడు

gv_prakash_kumarసంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మరో అవతారం ఎత్తనున్నాడు ఈ నెలాఖరిలొ అయన నూతన ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే కథ మరియు దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి విజయ్ సుకుమారన్ దర్శకత్వం వహించనున్నారు గతంలో ఈ దర్శకుడు బాలు మహేంద్ర మరియు వెట్రిమారన్ వంటి దర్శకుల వద్ద పని చేశారు. ఈ చిత్రం 2013 జనవరిలో మొదలు కానుంది. ఇది కాకుండా ఫాక్స్ స్టార్ స్టూడియోస్లో ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో జి వి ప్రకాష్ ప్రధాన పాత్ర పోషించనున్నారని పుకారు కూడా ఉంది. ఇదిలా ఉండగా అయన పలు చిత్రాలకు ప్రస్తుతం సంగీతం అందిస్తున్నారు. తెలుగులో “ఒంగోలు గిత్త”,”జెండా పై కపిరాజు”,”ఏమిటో ఈ మాయ” వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version