మార్చ్ 6న గుండెల్లో గోదారి ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Gundello-Godari

‘గుండెల్లో గోదారి’ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మార్చ్ 6న హైదరాబాద్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, మంచు మనోజ్ మరియు ‘గుండెల్లో గోదారి’ చిత్ర సభ్యులు హాజరుకానున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించిన విషయం తెలిసినదే. ఈ సినిమా 1980 ల నేపధ్యంలో తెరకెక్కించారు కనుక ఇళయరాజా కూడా దానికి తగ్గట్టుగానే సంగీతం అందించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ మంచి జోరు మీద సాగుతుంది. చిత్ర వర్గం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.

‘గుండెల్లో గోదారి’ సినిమాలో లక్ష్మి మంచు, తాప్సీ, సందీప్ కిషన్ మరియు ఆది ప్రధాన తారాగణం. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించాడు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి మంచు ఈ సినిమాను నిర్మించింది. బి. వి. ఎస్ రామారావు రచించిన గోదావరి కథలు పుస్తకమే ఈ చిత్రానికి ఆధారం. 1986లో గోదావరి ప్రాంతంలో వచ్చిన వరదల నేపధ్యంలో నలుగురి జీవితానికి ముడిపెడుతూ తీసిన సినిమా. ఈ చిత్రం మార్చ్ 8న మన ముందుకు రానుంది.

Exit mobile version