దసరా బరిలో గుండెల్లో గోదారి

దసరా బరిలో గుండెల్లో గోదారి

Published on Aug 28, 2012 8:16 PM IST


లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ‘ గుండెల్లో గోదారి’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 1986లో జరిగిన గోదావరి నది వరదల నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆది, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరదలు వచ్చే సన్నివేశాలు చిత్రీకరించడం కోసం భారీ సెట్ ను నిర్మించారు. కొద్ది రోజుల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఈ దసరాకి కొన్ని పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయి, ఈ చిత్రాల జాబితాలో ఇప్పుడు ‘గుండెల్లో గోదారి’ చిత్రం కూడా వచ్చి చేరింది. సినీ అభిమానులకు ఈ దసరా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు