ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టబోతున్న ‘రెబల్’

ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టబోతున్న ‘రెబల్’

Published on Sep 4, 2012 11:44 AM IST


తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు తమ సినిమా చిత్రీకరణ చివరి రోజు గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలా గుమ్మడికాయ కొట్టారంటే సినిమా చిత్రీకరణ పూర్తయినట్టే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం రేపు సాయంత్రం గుమ్మడికాయ కొట్టే కార్యక్రమం జరుపుకోనుంది.ప్రస్తుతం ఈ చిత్రంలో మిగిలి ఉన్న చిన్న చిన్న సన్నివేశాలను హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రీకరణ రేపటితో ముగియనుంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఆడియోని సెప్టెంబర్ 14 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ సరసన మిల్క్ బుటి తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్ మరియు జె పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు