చివరి దశ షూటింగ్లో గ్రీకు వీరుడు

Greekuveerudu

నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం “గ్రీకు వీరుడు” చివరి దశ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా ను కామాక్షి మూవీస్ బ్యానర్లో డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జనవరి మూడవ వారంలో ప్రారంభం అయి ఫిబ్రవరి 14 వరకు ఒక పాట మినహా షూటింగ్ ముగుస్తుందని నిర్మాత డి.శివ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు.చివరి పాట ను ఫిబ్రవరి 22 నుండి హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ సెట్ మద్య తీయవచ్చునని సమాచారం మీరా చోప్రా ఒక ముక్యమైన పాత్రను చేస్తుంది. ఈ సినిమాకు అనిల్ భండారి సినిమాటోగ్రాఫర్ గా మరియు ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఆడియో ను మార్చ్ లో విడుదల చేయనున్నారు.

Exit mobile version