భారీగా విడుదలవుతున్న శిరిడి సాయి


అక్కినేని నాగార్జున సాయి బాబా పాత్రలో నటించిన భక్తి రస చిత్రం ‘శిరిడి సాయి’ విడుదల తేదీ వివరాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిర్మాత మహేష్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్ర షూటింగ్ 60 రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసాము. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత చిత్ర ప్రింట్ ను షిరిడి తీసుకు వెళ్ళడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈ నెల సెప్టెంబర్ 6 న 801 థియేటర్లలో భారీగా విడుదల చేయబోతున్నాం” అన్నారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఇది మా 333 వ చిత్రం. 54 నిడివి గల శిరిడి సాయి ఆడియో ప్రతి రోజు ఉదయం వింటున్నాను. మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిర్మాత మహేష్ రెడ్డి గారు బడ్జెట్ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించకుండా పూర్తి స్వేచ్చ ఇచ్చారు. శిరిడి సాయి ఆడియో షిరిడీలో విడుదల చేయడానికి 160 మంది యూనిట్ సభ్యుల కోసం అయన ట్రైన్ బుక్ చేసారు అన్నారు.

Exit mobile version