నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని పెళ్లి ఈ నెల 21న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ హైటెక్స్ లో జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యెక ఏర్పాట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుక కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఓ భారీ సెట్ ని రూపొందిస్తున్నారు. ఈ వేడుకకి సౌత్ ఇండియన్ నుంచి పలువురు స్టార్స్ మరియు బాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్ళికి ముందు జరగాల్సిన కొన్ని సాంప్రదాయ బద్దమైన కార్యక్రమాలు ఇప్పటికే బాలకృష్ణ ఇంట్లో మొదలయ్యాయని సమాచారం.