పొల్లాచ్చిలో మొదలైన గౌరవం కొత్త షెడ్యూల్


టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ రెండవ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘గౌరవం’. ఇటీవలే రాజమండ్రి చుట్టూ పక్కల ప్రదేశాల్లో చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఇక్కడ ఈ చిత్రానికి సబందించిన కొంత టాకీ పార్ట్ మరియు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చివరి షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం కేరళకు బయలుదేరుతుంది. అల్లు శిరీష్ కి జోడీగా ‘నువ్విలా’ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన యామి గౌతం నటిస్తున్నారు. డ్యూయెట్ మూవీ బ్యానర్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆకాశమంత’ మరియు ‘గగనం’ చిత్రాల ద్వారా తెలుగు వారికి సుపరిచితుడైన రాధా మోహన్ ఈ ద్వి భాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్ మరియు ఎల్.బి శ్రీరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version