గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

హీరో గోపీచంద్ కొత్త చిత్రం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. భూపతి పాండియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాండ్ర రమేష్ బాలాజీ రియల్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ పతాకం మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ నిర్మాత తమిళం లో రెండు చిత్రాలను నిర్మించారు “ఉత్తమపుత్తిరన్” మరియు “ఒస్తే” చిత్రాలు తమిళం లో భారి విజయం సాదించాయి. ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా ఎస్.ఎస్.రాజ మౌళి,శౌర్యం శివ, సి కళ్యాణ్, బి వి ఎస్ ఎన్ ప్రసాద్ పలువురు ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు. మాటలు ఎం.రత్నం అందిస్తున్నారు శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version