చివరి దశకు చేరుకున్న గోపీచంద్ – యేలేటి సినిమా

Gopichand

మొగుడు తరువాత గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడంతో వరుస పరాజయాలు వెంటాడాయి. ఒక్కడున్నాడు కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేస్తూ వస్తున్న జాక్ పాట్ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న సినిమా ఇదొక్కటే. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో వ్వ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లడఖ్ ప్రాంతంలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని బెలూం గుహల ప్రాంతంలో క్లైమాక్స్ సంభందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకి లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version