హీరో గోపీచంద్ ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ వర్క్ పూర్తవగానే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో బి. గోపాల్ ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన చివరిగా ‘మస్కా’ సినిమాకి దర్శకత్వం వహించాడు. గోపీచంద్ హీరోగా నటించిన సాహసం’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ డైరెక్టర్స్ దేవ కట్టా, బి. గోపాల్ సినిమాలలో నటిస్తాడు. ఈ సినిమాలకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలో మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్.