‘డాన్ శీను’తో దర్శకుడిగా మారిన గోపీచంద్ మలినేని త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన శ్రీసత్య అనే అమ్మాయితో గోపీచంద్ వివాహం జరగుంది. ఏలూరులో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజు వీరి వివాహం జరగనుంది. హైదరాబాదులో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసారు. బాడీగార్డ్ తరువాత గోపీచంద్ ప్రస్తుతం బలుపు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రవితేజతో గోపీచంద్ చేస్తున్న రెండవ సినిమా ఇది.