విజయవంతంగా దూసుకుపోతున్న విశ్వరూపం


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విశ్వరూపం’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయవతంగా ప్రదర్శించబడుతోంది. ఆంధ్ర ప్రదేశ్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న తమిళనాడులో విడుదల కానుంది. అక్కడ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో మరియు నార్త్ ఇండియాలోనూ అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి.

ఈ సినిమాని తమిళనాడు గవర్నమెంట్ బాన్ చేయడంతో కమల్ పలుసార్లు చర్చించి చివరికి ముస్లీం మతాన్ని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని కోరగా వాటిని కమల్ తొలగిస్తానని చెప్పాక ఈ సినిమా రిలీజ్ కి ఓకే అన్నారు. కమల్ హాసన్ దర్శక నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా జెరేమియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version