రానా మరియు నయనతార ప్రధాన పాత్రలలో రానున్న “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రం నవంబర్ 30న భారీ విడుదలకు సిద్దమయ్యింది. విడుదలకు మూడు రోజులే ఉండటంతో ఈ చిత్ర ప్రచారం ఊపందుకుంది. మొదటి లుక్ మరియు ట్రైలర్ చూసినప్పటి నుండి రానా ఈ పాత్రను ఎలా చేసుంటాడు అన్న విషయం మీదనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ చిత్రంలో అయన సురభి నాటకాల కుటంబంలో ఒకరిగా కనిపించనున్నారు. నయనతార డాక్యుమెంటరీ చిత్రాలను తీసే యువతిగా కనిపించనుంది. ఈ చిత్రం మీద ఉన్న అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 ధియేటర్లలో విడుదల చెయ్యడానికి సురేష్ బాబు సిద్దమయ్యారు. వై రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు పంపిణి చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించగా జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.