ఈ సంవత్సరం ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన మళయాళ కుట్టి అమలా పాల్ తాజాగా తమిళ హీరో విజయ్ నటించిన అన్న సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మళయాళ కుట్టి కాసేపు సినిమాల గురించి పక్కన పెట్టి మానవత్వం గురించి చెబుతోంది. ‘ మనం అందంగా ఉంటే చాలదు, మన హృదయం కూడా అంతే అందంగా ఉండాలి. నావరకూ ఐతే కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలిపడడం కంటే వారికి నాకు వీలైనంత సాయం చేస్తాను, అలాగే వాళ్ళకి ఆత్మ స్థైర్యాన్ని నింపాలని’ అమలా పాల్ తన ఆలోచనల్ని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అమలాపాల్ నాని సరసన ‘జెండా పై కపిరాజు’ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో రెండు తమిళ సినిమాలు చేస్తోంది