First Posted at 16:58 on Apr 22nd
నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా శాటిలైట్ రైట్స్ అత్యధిక అమౌంట్ దాదాపుగా రూ.3.20 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇది నితిన్ కెరీర్ లోనే ఇంత పెద్ద అమౌంట్ కి అమ్ముడుపోయిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆంద్రప్రదేశ్ అంతటా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 20 కోట్ల షేర్ ను సాదించవచ్చునని బావిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్, ఇషా తల్వార్ లు హీరోయిన్స్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ని అందించాడు.