ప్రస్తుతం నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా భారీ విజయం సాదించడంతో అమితానందంలో వున్నాడు. క్రిందటి యేడు ‘ఇష్క్’ సినిమా ద్వారా ఫ్లాపుల ఊబినుండి బయటపడ్డ తనకి ఈ ఏడాది ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో జాక్ పాట్ కొట్టాడు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా అత్యంత ప్రజాదారణ పొందడంతో నితిన్ ఒక కొత్త విషయాన్ని మనకు చెప్పాడు. ‘ఇష్క్’ సినిమా 100రోజు కలెక్ట్ చేసిన డబ్బుని ఆశ్చర్యపరిచే రీతిలో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ కేవలం 9 రోజులలోనే సంపాదించింది అని తెలిపాడు.
సినిమా విడుదలకు ముందే ప్రజాదరణ పొందడం, నితిన్- నిత్య మీనన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం, సినిమా అంతా మంచి ఎంటర్టైనర్ గా సాగడం ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ మించిన ప్రేక్షకాకర్షణ పొందిన చిత్రం గత రెండువారాలుగా లేకపోవడం ఈ సినిమాకు మరో బలం. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిఖిత రెడ్డి నిర్మాత. నిత్య మీనన్ ఇషా తల్వార్ హీరోయిన్స్. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు.