‘అవతార్ 2’కి మళ్ళీ సిద్ధమా?? థియేటర్స్ లోకి ఎప్పుడంటే!

వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సొంతం చేసుకున్న చిత్రాల్లో హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ అవతార్ కూడా ఒకటి. దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్స్ వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచాయి. అయితే గత కొన్నేళ్ల కితమే అవతార్ 1 కి సక్సెసర్ అవతార్ పార్ట్ 2 అవతార్ ది వే ఆఫ్ వాటర్ వచ్చి సంచలనం సెట్ చేసింది.

మరి ఈ చిత్రాన్ని ఫైనల్ గా మేకర్స్ మళ్ళీ రీరిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒక్క వారం మాత్రమే లిమిటెడ్ ఎంగేజ్మెంట్ గా థియేటర్స్ లో రీరిలీజ్ కి డేట్ ని ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా ఈ రానున్న అక్టోబర్ 3 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఇది మాత్రం మళ్ళీ చూడాలి అనుకునేవారికి బిగ్ ట్రీట్ ఇచ్చే అప్డేట్ అని చెప్పవచ్చు. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా లేక ఓవర్సీస్ మార్కెట్ లోనేనా అనేది రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version