హవిష్ మరియు సనూస ప్రధాన పాత్రలలో రానున్న “జీనియస్” చిత్రం డిసెంబర్ 28న రానుంది. ప్రముఖ టివి యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ఈ మధ్యనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దాసరి కిరణ్ మాట్లాడుతూ ఈ చిత్రం రాష్ట్రంలో ప్రధాన డిస్ట్రిబ్యుటర్స్ ద్వారా విడుదల చెయ్యబడుతుంది. ఈ చిత్ర విజయం మీద మాకు నమ్మకం ఉంది. చిన్ని కృష్ణ కథ, పరుచూరి సోదరుల సంభాషణలు మరియు జోశ్వ శ్రీదర్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అన్నారు. హవిష్ గతంలో రవిబాబు దర్శకత్వంలో “నువ్విలా” చిత్రంలో కనిపించారు.