ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం కోసం విజయ్ చిత్రం వదులుకున్న గౌతం మీనన్

ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం కోసం విజయ్ చిత్రం వదులుకున్న గౌతం మీనన్

Published on Aug 23, 2012 8:21 PM IST


విజయ్ తో గౌతం మీనన్ చేస్తున్న “యోహన్” చిత్రం నిలిపివేయటం తాజాగా కోలీవుడ్లో అందరిని ఆశ్చర్య పరచిన విషయం. ఈ మధ్య కాలంలో కోలీవుడ్లో చాలా ఆసక్తి కరంగా వేచి చూసిన చిత్రాలలో ఈ చిత్రం ఒకటి, ఎందుకంటే గౌతం మీనన్ మరియు విజయ్ తొలిసారిగా ఒక చిత్రం కోసం కలిసి పని చెయ్యవలసిన చిత్రం ఇది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విజయ్ అభిమానులలో మంచి అంచనాలను సృష్టించింది. గౌతం మీనన్ తన రాబోతున్న ద్విభాషా చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” మీద పూర్తి దృష్టి సారించాలని అనుకున్నట్టు కనిపిస్తుంది ఇదే విషయాన్ని అయన ట్విట్టర్లో లో ప్రస్తావిస్తూ ఇలా అన్నారు ” విజయ్ తో “యోహన్” చిత్రాన్ని చెయ్యట్లేదు, విజయ్ తరువాతి చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నేను పూర్తిగా “నీథానే ఎన్ పోన్ వసంతం” చిత్రం పూర్తి చెయ్యటం మీద దృష్టి సారించాను. ఇది అయిపోయాక తరువాతి చిత్ర విశేషాలను వెల్లడిస్తాను” అని అన్నారు. “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈ చిత్ర తమిళ వెర్షన్ “నీథానే ఎన్ పోన్ వసంతం” చిత్రంలో జీవా మరియు సమంతలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చెన్నై శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ఆడియో విడుదల జరుపుకోనుంది.

తాజా వార్తలు