మహేష్ ను గర్వించేలా పని చేసిన గౌతమ్.!

కొడుకు పుట్టినప్పుడు కాదు అతడు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం అని అంటారు. పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని. తండ్రితో 1 నేనొక్కడినే లాంటి సినిమాలో మంచి మార్కులు కొట్టేసిన గౌతమ్ ఇప్పుడు వ్యక్తిగా కూడా ఓ మెట్టు ఎక్కి కష్ట కాలంలో ఇతరులకు సాయం చెయ్యడంలో నాన్నకు తీసిపోకుండా తన తండ్రి మహేష్ ను గర్వపడేలా చేసాడు.

తన స్నేహితులతో కలిసి “అక్షయ బంధన” పేరిట నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ తమ వంతు సాయం చెయ్యడం అందుకు గౌతమ్ నాయకత్వం వహించడం గర్వ కారణంగా ఉందని మహేష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అలాగే వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి గాను ఎవరైనా డొనేషన్ చెయ్యాలి అంటే వారి వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు అని తెలిపారు. ఈ కష్ట కాలంలో గౌతమ్ ఇలాంటి గ్రేట్ మూవ్ తీసుకోవడం నిజంగా మహేష్ కు చాలా గర్వకారణం అని చెప్పాలి.

Exit mobile version