మరో రెండు రోజుల్లో గౌరవంకి గుమ్మడి కాయ కొట్టనున్నారా?

మరో రెండు రోజుల్లో గౌరవంకి గుమ్మడి కాయ కొట్టనున్నారా?

Published on Nov 10, 2012 10:45 PM IST


‘ఆకాశమంత’ మరియు ‘గగనం’ సినిమాల డైరెక్టర్ రాధా మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తి చిత్రీకరణ నవంబర్ 12తో ముగియనుంది. ప్రస్తుతం సినిమాలోని నటీనటులందరితో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండవ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్నారు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజి, నాజర్ మరియు శ్రీ చరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని 2013 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోయే మిగతా చిత్రాల స్టేటస్ చూసుకొని రాధా మోహన్ మరియు ప్రకాష్ రాజ్ త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని తెలియజేయనున్నారు.

తాజా వార్తలు