మరో ఓటీటీలోకి వచ్చేసిన “గేమ్ ఛేంజర్”..కానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తెలుగు సినిమా “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఊహించని విధమైన ఫలితాన్ని చూడల్సి వచ్చింది. ఇక ఇలా గత నెల లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తే ఇపుడు మరో ఓటీటీలో కూడా సినిమా వచ్చేసింది.

అయితే ఈసారి హిందీ వెర్షన్ లో సినిమా వచ్చింది. ఈ సినిమా హిందీ ఓటీటీ హక్కులు జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అందులో ఈరోజు నుంచే సినిమా వచ్చేసింది. ఒకవేళ హిందీ వెర్షన్ ఎలా ఉందో తెలియాలి అంటే జీ 5 లో ట్రై చేయవచ్చు. కానీ ఇందులో ఈ సినిమా నిడివి తగ్గించి రావడం గమనార్హం. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version