గజరాజు వచ్చే వరం వస్తుందా?

Gajaraju
తమిళంలో గొప్ప నటుడు శివాజీ గణేషన్ మనుమడు విక్రం ప్రభుని హీరోగా పరిచయం చేస్తూ రానున్న చిత్రం “గజరాజు” తమిళ చిత్రం “కుమ్కి” కి డబ్బింగ్ చిత్రం అయిన ఈ చిత్రానికి ప్రభు సోలమన్ దర్శకత్వం వహించారు. లక్ష్మి మీనన్ ఈ చిత్రంలో విక్రం ప్రభు సరసన నటించారు. తెలుగులో బెల్లం కొండ సురేష్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ డిసెంబర్ 14న విడుదల అయ్యింది తెలుగులో కూడా అదే రోజున విడుదల అవ్వాల్సి ఉండగా ధియేటర్లు లేని కారణంగా విడుదల చేసినట్టు లేరు.ఆంధ్ర ప్రదేశ్ లో చాలా భాగం ధియేటర్లలో “ఎటో వెళ్లిపోయింది మనసు”, “యమహోయమ”, “కృష్ణం వందే జగద్గురుమ్” మరియు “డమరుకం” ప్రదర్శిస్తున్నారు. మరో వారంలో కాని రెండు వారాల్లో కాని ఈ చిత్రాన్ని విడుదల చేయ్యన్నారు. ఈ చిత్రం ఒక మావటి చుట్టూ తిరుగుతుంది. ఇమామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గతంలో “ప్రేమఖైదీ” చిత్రంతో ప్రభు సోలమన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ చిత్రాన్ని తెలుగు లో ఆదరించారు మరి ఈ చిత్ర పరిస్థితి ఏంటో చూడాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

Exit mobile version