‘గబ్బర్ సింగ్’ మళ్ళీ వచ్చాడు.!

‘గబ్బర్ సింగ్’ మళ్ళీ వచ్చాడు.!

Published on Nov 9, 2012 1:28 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ‘గబ్బర్ సింగ్’ సినిమాతో 2012లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. విడుదలై చాలా నెలలు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్లో ఈ రోజు నుంచి నాలుగు ఆటలు ప్రదర్శించనున్నారు.

ఇదంతా ఏమిటా అనుకుంటున్నారా అనుకున్న దాని ప్రకారం ‘డమరుకం’ సినిమా ఈ రోజు విడుదల కావాలి కానీ అది వాయిదా పడడంతో ఇంకేమీ తెలుగు సినిమాల విడుదల లేకపోవడంతో ఎగ్జిబిటర్లు ‘గబ్బర్ సింగ్’ ని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్లో ‘గబ్బర్ సింగ్’ తో పాటు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా కూడా ప్రదర్శించబడుతోంది. మళ్ళీ ‘గబ్బర్ సింగ్’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకునే వారు వెళ్లి చూసి ఎంజాయ్ చెయ్యండి.

తాజా వార్తలు