రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం రవి కిరణ్ కోలా ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక ఆ మధ్య కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. కాగా ఇప్పుడు విజయ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఒకటి. ఈ సినిమాతో పాటు రౌడీ జనార్దన సినిమాను కూడా విజయ్ చేస్తున్నాడు.
